NGKL: కల్వకుర్తిలో రోడ్డు ప్రమాదంలో భరత్ కుమార్ (25) మృతి చెందాడు. రఘుపతిపేటకు చెందిన భరత్ ఓ యాడ్స్ ఏజెన్సీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. స్వగ్రామం నుంచి బైక్‌పై కల్వకుర్తికి వస్తుండగా అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి


