హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'షహీద్ పుస్తక్ టోలీ - అమరులు వారు' పుస్తకం ఆవిష్కరణ

GNTR: మంగళగిరిలో బుధవారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులకు ఆయన ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం 'షహీద్ పుస్తక్ టోలీ - అమరులు వారు' అనే పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. సమాజ రక్షణ కోసం పోలీసులు చేసిన త్యాగాలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.