హైదరాబాద్: 28°C
తెలంగాణ

పందుల బెడద నుండి కాపాడండి

SDPT: బెజ్జంకిలో పందుల స్వేచ్ఛా సంచారంతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు తెలుపుతున్నారు. వీధులు, ఇళ్ల పరిసరాలు, పొలాల్లో పందులు తిరుగుతూ పారిశుద్ధ్యానికి ఆటంకం కలిగించడంతో పాటు పంటలను ధ్వంసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పందుల యజమానులు వాటిని తమ ఆధీనంలో ఉంచుకోవాలని, పాలకవర్గం స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.