హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుర్గా ఘాట్ ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్

కర్నూలు నగరంలో నేడు జరగనున్న దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవం నేపథ్యంలో సంకల్ భాగ్ ప్రాంతంలోని దుర్గా ఘాట్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు బుధవారం పరిశీలించారు. నిమజ్జనోత్సవానికి అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కమీషనర్ సూచించారు.