హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనాపూర్‌లో తాగునీటి ఎద్దడి

VKB: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని ఘనాపూర్‌లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. తాగునీరు లేక వంట, రోజువారీ పనులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు స్పందించి వెంటనే ట్యాంకర్ల ద్వారా నైనా నీరందించాలని డిమాండ్ చేస్తున్నారు.