హైదరాబాద్: 28°C
తెలంగాణ

దొంగతుర్తిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

PDPL: ధర్మారం మండలం దొంగతుర్తిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన పాలకుర్తి మల్లేశం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. మాజీ ఎంపీపీ కొడారి హన్మయ్య, ఉపసర్పంచ్ తమ్మడవేణి రాజయ్య, వార్డు సభ్యులు దాడి సదయ్య, కొమ్మ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.