KMR: మార్కెట్లో సన్న బియ్యం (జైశ్రీరాం రకం) ధరలు ఒక్కసారిగా పెరిగాయి. నాలుగు రోజుల్లోనే క్వింటాలుకు రూ.1,200 పెరిగి రూ.9,200కు చేరింది. ఎల్నినో ప్రభావం పేరుతో బస్తాపై రూ.300 వరకు ధర పెంచడంతో సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. బియ్యం ధరలను నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
సన్న బియ్యం ధరలకు రెక్కలు


