హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోమందేపల్లిలో 144 సెక్షన్ అమలు

సత్యసాయి: సోమందేపల్లి మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నేపథ్యంలో పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు. 144 సెక్షన్, 30వ పోలీసు యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ యాదవ్ తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయం, YSR సర్కిల్, ప్రభుత్వ పాఠశాలల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ప్రజలు గుంపులుగా ఉండకూడదని సూచించారు.