హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుడి పైకప్పు పగలగొట్టి విగ్రహాల ధ్వంసం

BDK: ఆళ్లపల్లి(M) అనంతోగులో సమ్మక్క-సారక్క ఆలయంపై అకృత్యం జరిగింది. దుండగులు గుడి పైకప్పును పగలగొట్టి అమ్మవార్ల విగ్రహాలను బయటపడేశారు. ఇటీవల బతుకమ్మ వేడుకల్లో జరిగిన గొడవే ఈ ఘటనకు కారణమై ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. తమ ఆరాధ్య దైవాల ఆలయాన్ని ధ్వంసం చేయడంపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.