హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాళ్లపేటలో ఉద్రిక్తత

MNCL: దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ వర్గానికి చెందిన నేత ఆకుల దుర్గాప్రసాద్‌పై ప్రత్యర్థి వర్గం దాడి చేసింది. ఈ దాడిలో గాయపడిన ఆయన్ను లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్కడి పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు.