హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ బస్సులో మహిళకు పురిటినొప్పులు, బస్సులోనే ప్రసవం

VKB: తాండూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో కర్ణాటకకు చెందిన పుష్పలతకు మార్గమధ్యంలో పురిటినొప్పులు వచ్చాయి. తోటి మహిళా ప్రయాణికులు వెంటనే స్పందించి బస్సులోనే ఆమెకు ప్రసవం చేశారు. అనంతరం డ్రైవర్ బస్సును నేరుగా తాండూరు మాతా శిశు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. డ్రైవర్, తోటి ప్రయాణికుల చొరవను స్థానికులు అభినందించారు.