హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'130 ఎకరాల ఇళ్ల స్థలాలు కేటాయించిన ఘనత కాంగ్రెస్‌దే'

కోనసీమ: మండపేట పట్టణంలో 130 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఛైర్మన్ కామన ప్రభాకరరావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ అభ్యర్థి అలమండ సూరిబాబుకు మద్దతుగా ఆయన పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీని బలపరచాలని కోరారు.