హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేణిగుంటలో స్థానిక పోరు, గెలుపే లక్ష్యం: దివాకర్

TPT: స్థానిక ఎన్నికల్లో రేణిగుంట మండలంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలన్నింటినీ గెలుచుకోవాలని తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మండల స్థాయి నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షలో ఎన్నికల వ్యూహాలు, బూత్ కమిటీల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. నాయకులు, కార్యకర్తలు విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.