హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా వేడుకల్లో ఘర్షణ: మహిళా కానిస్టేబుల్‌కు గాయాలు!

HMK: పరకాల మండలం రాజీపేటలో దసరా వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మంగళవారం రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవను అదుపు చేసే ప్రయత్నంలో విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ గాయపడ్డారు. గొడవను నియంత్రించే క్రమంలో జరిగిన తోపులాటలో ఆమె కిందపడటంతో చేయి విరిగినట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన సహచర సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.