హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముంచుకొస్తున్న జల సంక్షోభం

MDCL: ఎల్‌నినో ప్రభావంతో సిటీలో జల సంక్షోభం ముంచుకొస్తోంది. హైదరాబాద్‌లో 35%, మేడ్చల్‌లో 40%, రంగారెడ్డిలో 25% వర్షపాతం లోటు నమోదైంది. ఏడాదిలోనే హైదరాబాద్‌లో భూగర్భ జలమట్టం 3.57 మీటర్‌ల నుంచి 10.01 మీటర్‌లకు పడిపోయింది. గతంలో 300 అడుగులకే నీరందిన చోట్ల ఇప్పుడు వెయ్యి అడుగుల లోతులోనూ జాడలేదు. బోర్‌లు ఎండిపోతున్నాయి. దీంతో కొత్త బోర్‌ల తవ్వకాలపై నిషేధం విధించారు. ప్రభుత్వం, జలమండలి అప్రమత్తమయ్యాయి.