హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కిలో ఉల్లిపాయలు రూ. 35కే!

కోనసీమ: ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై ఉల్లిపాయలను విక్రయిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం నుంచి రావులపాలెం రైతుబజార్‌లో కిలో ఉల్లిపాయలను రూ. 35కే అందిస్తున్నారు. ఈ విషయాన్ని రైతుబజార్ ఎస్టేట్ ఆఫీసర్ బి. తేజ తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.