హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అవనిగడ్డలో పోలీసుల పటిష్ట బందోబస్త్

కృష్ణా: అవనిగడ్డలో పోలీసులు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు. నేటి నుంచి ఎంపీటీసీల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం వద్ధ ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బందితో గస్తీ ఏర్పాటు చేశారు. నియమ నిబంధనల ప్రకారం నామినేషన్ల ప్రక్రియ జరిగేలా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై తెలిపారు.