హైదరాబాద్: 28°C
తెలంగాణ

TRS యువజన జిల్లా జనరల్ సెక్రటరీగా రాము

KMR: తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) KMR జిల్లా యువజన విభాగం జనరల్ సెక్రటరీగా రాజంపేట మండల కేంద్రానికి చెందిన జొన్నల రామును పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియమించారు. ఈ సందర్భంగా రాము కవితక్కకు కృతజ్ఞతలు తెలిపారు. గత 13 ఏళ్లుగా జాగృతి, టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్న తాను, జిల్లాలో యువతను సమీకరించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.