ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఇవాళ దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధు హాజరై సంప్రదాయబద్ధంగా శమీపూజ నిర్వహించారు. విజయదశమి పండుగను ఘనంగా జరుపుకున్న ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
తెలంగాణ భవన్లో ఘనంగా దసరా వేడుకలు..!


