హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా హేమలత

AKP: నక్కపల్లి టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా నియోజకవర్గం పార్టీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ సతీమణి హేమలతను ఎంపిక చేశారు. ఈ మేరకు హోం మంత్రి ఆమె పేరును ప్రకటించారు. గత రాత్రి నుంచి ఆమె ప్రచారాన్ని కూడా చేపట్టారు. తనకు అవకాశం ఇస్తే మండల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.