హైదరాబాద్: 28°C
తెలంగాణ

కర్ణాటక అడవుల్లో వేట.. మలక్‌పేటలో అరెస్ట్

HYD: కర్ణాటకలోని కలబురిగి అడవుల్లో లైసెన్స్ తుపాకీతో జింకలను వేటాడి వస్తున్న మలక్‌పేటకు చెందిన ముగ్గురిని పోలీసులు, టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేసినట్లు చార్మినార్ జోన్ DCP కిరణ్ తెలిపారు. స్కార్పియో కారుతో పాటు స్పోర్టింగ్ రైఫిల్, 3 నైట్ విజన్ టెలిస్కోప్‌లు, 8 లైవ్ బుల్లెట్లు, 12 ఖాళీ కాత్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.