హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యే శ్రావణి సమీక్ష

ATP: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా శింగనమల క్యాంపు కార్యాలయంలో వివిధ మండలాల నుంచి వచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే బండారు శ్రావణి సమావేశమయ్యారు. ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికపై గ్రామాల వారీగా చర్చించి, వ్యూహాలు ఖరారు చేశారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులంతా సమన్వయంతో క్షేత్రస్థాయిలో శ్రమించాలని పిలుపునిచ్చారు.