హైదరాబాద్: 28°C
తెలంగాణ

TRS పార్టీ పరకాల ఇన్‌ఛార్జ్‌గా కిషోర్ నియామకం

HNK: తెలంగాణ రక్షణ సేన పరకాల నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా సోల్తి కిషోర్‌ను ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత నియమించారు. పరకాల నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ.. పార్టీ విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కవిత సూచించారు. హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాజిరెడ్డి మడ్గుల, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా బండారి సుమన్ నియమితులయ్యారు.