హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి: సీఐ

సత్యసాయి: కదిరిలోని 27, 28, 29, 30వ వార్డుల్లో టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు వీధి కూడళ్ల సమావేశాలు నిర్వహించారు. రాబోయే ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రజలందరూ పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు, ప్రలోభాలకు లోనుకాకుండా ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.