హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

పార్వతీపురం మన్యం జిల్లాలో పరిషత్‌ ఎన్నికలకు నగారా మోగింది. 15 మండలాల్లో 226 ఎంపీటీసీ, 15 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న పరిశీలన, 27న ఉపసంహరణ ఉంటుంది. నవంబరు 3న పోలింగ్‌, 5న ఓట్ల లెక్కింపు, ఫలితాలను ప్రకటిస్తారు.