హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ బీచ్‌లో యువకుడిపై కత్తితో దాడి

విశాఖపట్నంలోని మంగమారిపేట బీచ్‌లో గత రాత్రి ముగ్గురు యువకుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రెల్లివీధికి చెందిన మెరుగు హరి, మంగమారిపేటకు చెందిన కారి ఎల్లాజీపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఎల్లాజీ తల, చేతిపై గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. దాడికి పాల్పడిన మెరుగు హరి భీమిలి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.