హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ బస్సులో మందుబాబు హల్‌చల్

ADB: ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోని మహోర్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో తాంసీ మండలం గిరిగాంకు చెందిన ఓ మందుబాబు హల్‌చల్ చేశాడు. తలమడుగు మండలం సుంకిడిలో బస్సెక్కిన ఆ వ్యక్తి కండక్టర్ సీట్లో కూర్చుని, తోటి ప్రయాణికుడితో గొడవ పడ్డాడు. దీనివల్ల బస్సు పలుమార్లు ఆగింది. విసుగు చెందిన ప్రయాణికులు మహారాష్ట్ర మాండీవీ పీఎస్ ఎదుట బస్సు నిలిపి, పోలీసులకు అప్పగించారు.