హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి'

AKP: ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం SEC-EMS పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోటవురట్ల ఏఆర్ఓ ఎంపీడీవో చంద్రశేఖర్ సూచించారు. సిబ్బంది తమ మొబైల్ నంబరుతో రిజిస్టర్ చేసుకుని, తొలిసారి లాగిన్ అయిన వెంటనే పాస్‌వర్డ్ మార్చుకోవాలని తెలిపారు. అర్హులైన వారంతా త్వరగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.