హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూత్, స్టూడెంట్ విభాగాలకు కొత్త నాయకత్వం

BHPL: జిల్లాలో తెలంగాణ రక్షణ సేన నూతన నాయకత్వాన్ని నియమించారు. జిల్లా అధ్యక్షుడిగా కుష్ఠ నరేష్ నేత,జిల్లా యూత్ అధ్యక్షుడిగా వినోద్ గౌడ్, స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా కొలికపొంగు విఘ్నేష్‌ను నియమించారు. మంగళవారం పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.