హైదరాబాద్: 28°C
తెలంగాణ

పండగ పూట పెను విషాదం.. యువ లాయర్ ఆత్మహత్య!

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం(M) వి.వెంకటాయపాలెంలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా కోర్టులో జూనియర్ లాయర్‌గా పనిచేస్తున్న తొలుపునూరి గణేశ్ (27) ముదిగొండ మండలం పెద్దమండవలోని అమ్మమ్మ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కొద్దిరోజులుగా కొందరు తనను వేధిస్తున్నట్లు గణేష్ ఆవేదన చెందాడని తండ్రి దానయ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.