హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జిల్లాలో దేవతామూర్తుల వైభవ దర్శనం

KMM: విజయదశమి వేడుకల్లో భాగంగా ఖమ్మంలోని జమ్మిబండకు భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీ రాజరాజేశ్వరీ దేవి, లక్ష్మీనృసింహస్వామి దర్శనంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్తంభాద్రి ఆలయం నుంచి వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారిని ఊరేగింపుగా తీసుకురావడంతో జమ్మిబండ పరిసరాలు సందడిగా మారాయి.