హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పులివెందులలో వైసీపీ నేతల ఇళ్లపై దాడులు!

KDP: పులివెందులలో మంగళవారం అర్ధరాత్రి వైసీపీ నాయకులకు చెందిన ఇళ్లపై దాడులు జరిగినట్లు సమాచారం. దుండగులు బీరు సీసాలతో దాడులకు పాల్పడటంతోపాటు, నిరంజన్‌రెడ్డికి చెందిన లారీ, కౌన్సిలర్ అభ్యర్థి అంజనప్ప ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలపై బాధితులు టీడీపీ నాయకులపై ఆరోపణలు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.