ASR: చింతపల్లి (M)బలపం పంచాయతీ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో ఇవాళ ఉదయం దట్టమైన పొగమంచు అలుముకుంది. మంచు తెరలతో చెట్లు, కొండలు కనుమరుగై ఆ ప్రాంతమంతా ఆహ్లాదకరంగా మారింది. చలికాలం ప్రారంభం కావడంతో ఏజెన్సీలో పొగమంచు ప్రభావం పెరుగుతోంది. ఈ దృశ్యాలు స్థానికులతో పాటు పర్యాటకులను ఆకట్టుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
దట్టమైన పొగమంచు.. కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు


