హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆత్మరక్షణ కోసం రివాల్వర్.. ఆల్ ఇండియా పర్మిషన్ ఉంది: మల్లారెడ్డి

HYD: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తన వద్ద ఉన్న రివాల్వర్‌ను 1986లో సింగపూర్‌లో రూ. 3 వేలకే కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఆల్ ఇండియా పర్మిషన్‌తో రివాల్వర్ ఉందని తెలిపారు. ఆత్మరక్షణ కోసం వినియోగించే ఆయుధానికి విజయదశమి సందర్భంగా మంగళవారం బోయినపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించారు.