హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురం శిల్పారామంలో దసరా సంబరాలు

అనంతపురం శిల్పారామంలో దసరా పండుగను పురస్కరించుకొని మంగళవారం దసరా సంబరాలను ఘనంగా నిర్వహించారు. పరిపాలనా అధికారి సి.రమేశ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రముఖ కళాకారులచే పాటల పండుగ, డప్పుల ప్రదర్శనలు, జానపద గీతాలు, కోలాటం, భరతనాట్యం తో పాటు వివిధ నృత్య ప్రదర్శనలను నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు నాగిన్ ప్రసాద్, ప్రేమ్, రిథమ్ ప్యాడ్ అనిల్, తదితరులు పాల్గొన్నారు.