హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బస్టాండ్లు లేక ప్రయాణికుల అవస్థలు

ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో బస్టాండ్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కెరమెరి, జైనూర్, సిర్పూర్(యూ), దహెగాం, సిర్పూర్(టి), బెజ్జూరు, చింతలమానేపల్లిలో ఎండ, వాన, చలికి రోడ్లపైనే వేచి ఉంటున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు లేక అవస్థలు పడుతున్నారు. వాంకిడి బస్టాండ్ నిరుపయోగంగా మారింది. ప్రయాణికులకు వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.