హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబర్‌పేటలో వీధి కుక్కల బెడద.. ప్రజల్లో ఆందోళన

HYD: అంబర్‌పేట, రామంతపుర్ ప్రాంతంలో వీధి కుక్కల సమస్యపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీల్లో, రహదారులపై వీధి కుక్కలు సంచరిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం, రాత్రి సమయాల్లో రాకపోకలు సాగించే ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.