హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే కోడూరులో అనాధ శవానికి అంత్యక్రియలు

అన్నమయ్య: రైల్వేకోడూరులో అనాధ శవానికి భోళా శంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని బస్ షెల్టర్ వద్ద భిక్షాటన చేసుకుంటున్న వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న భోళాశంకర్ సేవా సమితి అధ్యక్షుడు మందల నాగేంద్ర పోలీసు వారికి, పంచాయతీ కార్యదర్శికి సమాచారం అందజేశారు. వారి అనుమతితో అంత్యక్రియలు నిర్వహించారు.