హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరా ఉత్సవాల్లో అగ్నిప్రమాదం

AKP: అనకాపల్లి దసరా ఉత్సవాల్లో విద్యుత్ అలంకరణలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఉత్సవాలను తిలకించేందుకు వచ్చిన ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.