హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీలకు నామినేషన్లు

W.G: ఆకివీడులోని 12 ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు బుధవారం నుంచి నామినేషన్ స్వీకరించనున్నారు. ఆకివీడులోని మండల పరిషత్ కార్యాలయం వద్ద నామినేషన్ల ప్రక్రియ కొనసాగనంది. ఇందుకోసం కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలని ఎన్నికల అధికారి కోరారు. ర్యాలీగా నామినేషన్లకు రావద్దని సూచించారు.