హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నామినేషన్ల వేళ పోలీస్ నిబంధనలు పాటించాలి'

BPT: ఇంకొల్లు మండల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో అభ్యర్థులు, ప్రజలు నిబంధనలు పాటించాలని ఎస్సై వినోద్ బాబు కోరారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ఇద్దరికే అనుమతి ఉంటుందని, కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఒకే వాహనాన్ని అనుమతిస్తామని స్పష్టం చేశారు. ర్యాలీలు, కాన్వాయ్‌లకు అనుమతి లేదని నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.