W.G: ఆకివీడు జడ్పీటీసీ అభ్యర్థిగా కూటమి తరఫున టీడీపీకి చెందిన నౌకట్ల వెంకటలక్ష్మిని ఎంపిక చేశారు. ఆమె స్వగ్రామం ఐ. భీమవరం. ఆమె భర్త నౌకట్ల రామారావు టీడీపీలో కీలకంగా వ్యవహరించడంతో పాటు ఆకివీడు ఎంపీపీగా పనిచేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించి అఖండ మెజార్టీతో విజయం సాధిస్తామని కూటమి శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
ఆకివీడు జడ్పీటీసీ అభ్యర్థిగా వెంకటలక్ష్మి


