హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరువు నివారణకు ప్రత్యేక నిధులు

HYD: ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 6,000 కోట్ల ప్రత్యేక నిధి కేటాయించాలని నిర్ణయించింది. 315 మండలాల్లో నీటి ఎద్దడి, విద్యుత్ కొరత నివారణే దీని లక్ష్యం. తాగునీరు, వ్యవసాయ విద్యుత్, పశుగ్రాసం సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. రైతులకు ఎకరానికి రూ. 10,000 పరిహారం అందించే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.