హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఇంటిపై దాడి.. ముగ్గురికి గాయాలు

BPT: బాపట్ల మండలం గోపాపురంలో ఓ ఇంటిపై సుమారు 50 మంది యువకులు దాడికి పాల్పడ్డారు. కర్రలతో తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి, మారణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో దండమూడి కోటేశ్వరరావు, ఆయన భార్య పరిశుద్ధం, కుమారుడు రాకేశ్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు