హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం: MLA

అన్నమయ్య: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని MLA షాజహాన్ బాషా సూచించారు. మంగళవారం నిమ్మనపల్లి మండల నాయకులతో సమావేశమై ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల గెలుపు, పార్టీ బలోపేతంపై చర్చించారు. మండలంలోని 9 MPTC, 10 సర్పంచి,ఒక MPP, ఒక ZPTC స్థానాలను కైవసం చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.