హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నామినేషన్లు రాజమండ్రి జడ్పీ కార్యాలయంలో వేయాలి'

E.G: జిల్లాలో జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 3న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఉండ్రాజవరం ఎంపీడీవో తెలిపారు. జడ్పీటీసీ నామినేషన్లు వేసేవారు రాజమండ్రిలోని డి-మార్ట్ సమీపంలోని జడ్పీ కార్యాలయంలో తమ నామినేషన్లు దాఖలు చేసుకోవాలని ఆయన సూచించారు. నామినేషన్ల పత్రాలు సెట్‌ను సరిచూసుకోవాలన్నారు.