హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీచ్‌ ప్రమాదంపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి

SKLM: గనగళ్లవాని పేట బీచ్‌‌లో సముద్ర స్నానానికి వెళ్లి నలుగురు గల్లంతు కాగా, వారిలో ఇద్దరు మృతి చెందిన ఘటనపై స్థానిక ఎమ్మెల్యే శంకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పర్యాటకులు ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా సముద్ర తీరంలో ప్రమాద హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.