హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వైభవం'

NTR: ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసేలా ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయని CM చంద్రబాబు అన్నారు. 10 రోజుల్లో 15 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శన భాగ్యం పొందడం సంతోషకరమన్నారు. దాదాపు 8 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించడం అమ్మ సేవలో సమష్టి కృషికి నిదర్శనమని చెప్పారు. గతంతో పోలిస్తే దర్శనానికి పట్టే సమయం తగ్గడం, సేవల నాణ్యత పెరగడం అభినందనీయమన్నారు.