హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దక్కని వార్డు మెంబర్ పదవి... జనసేన వీరమహిళ రాజీనామా

E.G: కొవ్వూరు మున్సిపాలిటీలో వార్డు మెంబర్ పదవి దక్కకపోవడంతో జనసేన పార్టీ వీరమహిళ కడదారి నవ్య నూలువారిసత్రం మెంబర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసినప్పటికీ పదవి దక్కకుండా కొందరు స్థానిక నాయకులు అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురై రాజీనామా చేసినట్టు తెలిపారు.