హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కోలాటాలు, నృత్యాల నడుమ అమ్మవారి ఊరేగింపు

WGL: వరంగల్ గిర్మాజీపేటలోని విశ్వకర్మ వీధిలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. విజయదశమి సందర్భంగా మంగళవారం రాత్రి అమ్మవారి విగ్రహాన్ని భక్తుల కోలాహలం నడుమ ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. మహిళలు కోలాటాలు, నృత్యాలతో సందడి చేయగా, భక్తుల జయజయధ్వానాలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.